డీకే ఆఫీసులో విచ్చలవిడి అవినీతి
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మరో ఇద్దరు సీనియర్ మంత్రుల కార్యాలయాలలో అవినీతి విలయతాండవం చేస్తోందని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్‌సీఏ) గురువారం సంచలన ఆరోపణలు ఆరోపించింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు అవినీతి చీడ మితిమీరి పోయిందని కేఎస్‌సీఏ వెల్లడించింది.
- బ్రోకర్లతో నిండిన కర్ణాటక డిప్యూటీ సీఎం కార్యాలయం
- అవినీతి చీడలో బీజేపీని మించిన కాంగ్రెస్ సర్కార్
- కాంట్రాక్టర్ల సంఘం సంచలన ఆరోపణలు
బెంగళూరు, ఏప్రిల్ 10 : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మరో ఇద్దరు సీనియర్ మంత్రుల కార్యాలయాలలో అవినీతి విలయతాండవం చేస్తోందని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్‌సీఏ) గురువారం సంచలన ఆరోపణలు ఆరోపించింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు అవినీతి చీడ మితిమీరి పోయిందని కేఎస్‌సీఏ వెల్లడించింది. శివకుమార్ కార్యాలయంలో బ్రోకర్లు కిక్కిరిసిపోయి ఉంటారని కేఎస్‌సీఏ అధ్యక్షుడు ఆర్ మంజునాథ్ తెలిపారు. మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోస్‌రాజు కుమారుడు రవి బోస్‌రాజు లావాదేవీలన్నీ తానే జరుపుతారని, ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి బంధువు ఒకరు శాఖాపరమైన వ్యవహారాలలో తలదూరుస్తాడని ఆయన ఆరోపించారు.
ఈ ఆరోపణలపై శివకుమార్ స్పందిస్తూ కాంట్రాక్లర్లు ఫిర్యాదు నమోదు చేయాలని కోరగా బోస్‌రాజు, సతీష్ వీటిని ఖండించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన సౌధలో జరిగిన ఓ కార్యక్రమంలో ముడుపులు, దళారులకు వ్యతిరేకంగా మాట్లాడిన రోజే కేఎస్‌సీఏ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. అవినీతిలో కర్ణాటక దేశంలోనే నంబర్ వన్ అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన 48 గంటల్లోనే ఏకంగా రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం సీనియర్ మంత్రులపై అవినీతి ఆరోపణలు గుప్పించడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

