జమ్మూ: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah), ఆయన తండ్రి డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా ఇవాళ వందేభారత్ రైలులో ప్రయాణించారు. శ్రీనగర్ నుంచి కాట్రాకు ఆ ఇద్దరూ రైలులో ప్రయాణించారు. ఇటీవల శ్రీనగర్ నుంచి కాట్రాకు వందేభారత్ రైలును ప్రధాని మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. చైర్‌కారు సీటులో కూర్చున్న ఒమర్ అబ్దుల్లా .. ఓ సెల్ఫీ దిగారు. రైలు కిటికీ నుంచి ఓ వీడియోను షూట్ చేసి దాన్ని తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతలకు కాట్రా రైల్వే స్టేషన్లో స్వాగతం పలికారు. ఎస్సీ అడ్వైజర్ నాసిర్ అస్లం వానీ కూడా ఆ ట్రిప్‌లో ఉన్నారు. జూన్ 10వ తేదీన ఫారూక్ అబ్దుల్లా తొలిసారి వందేభారత్ రైలులో ప్రయాణంచారు. దేశంలోని రైల్వే నెట్‌వర్క్‌తో కశ్మీర్‌ను కలపడం సంతోషంగా ఉందని గతంలో ఫారూక్ అబ్దుల్లా తెలిపారు.
జూన్ 6వ తేదీన కాట్రా, శ్రీనగర్ మధ్య వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Time to head to Jammu #VandeBharat #vandebharatexpress #traintravel pic.twitter.com/aZr94orEjI
— Omar Abdullah (@OmarAbdullah) June 19, 2025