చెన్నై: కరూర్‌లో విజయ్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్పృహ కోల్పోయినవారికి, గాయపడినవారికి తక్షణమే చికిత్స అందించాలని ఆదేశించారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, మంత్రి సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్లతో తాను మాట్లాడానని చెప్పారు.
కరూర్‌కు వెళ్లి సహాయం అందించాలని మంత్రి అన్బిల్ మహేశ్‌ను స్టాలిన్ ఆదేశించారు. పరిస్థితిని అదుపు చేయడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఏడీజీపీని ఆదేశించారు. వైద్యులు, పోలీసులకు సహకరించాలని కోరా రు. ఆదివారం స్టాలిన్ కరూర్‌ను సందర్శిస్తారని అధికారులు తెలిపారు.