Odisha Train Accident | మృతుల సంఖ్యపై సీఎం మమతా బెనర్జీ, రైల్వే మంత్రి మధ్య భిన్నాభిప్రాయాలు
Odisha Death Toll: రైలు ప్రమాదంలో 500 మంది మరణించి ఉంటారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అయితే ఆమె పక్కనే ఉన్న రైల్వే మంత్రి జోక్యం చేసుకుని కేవలం 238 మంది ప్రయాణికులు మాత్రమే చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య విషయంలో సీఎం మమతా, రైల్వే మంత్రి వైష్ణవ్ మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి.
బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న బహనాగా స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లు వేర్వేరు మృతుల సంఖ్య(Death Toll)ను వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 500 దాటినట్లు తనకు సమాచారం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అయితే ఆ సమయంలో అక్కడ దీదీ పక్కన నిలుచున్న రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ జోక్యం చేసుకుని, ఒడిశా ప్రభుత్వ డేటా ప్రకారం కేవలం 238 మంది మరణించినట్లు వెల్లడించారు.
రైల్వే మంత్రి వైష్ణవ్ జోక్యం చేసుకున్న తర్వాత మమతా బెనర్జీ మళ్లీ జోక్యం చేసుకుని శుక్రవారం రాత్రి వరకే 238 మంది మరణించినట్లు ఆమె చెప్పారు. ఇంకా మూడు కోచ్‌ల్లో రెస్క్యూ పని పూర్తి కాలేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. యాంటీ కొలిజిన్ కవచ్ వ్యవస్థ ఆ రెండు రైళ్లలో లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం.. ఒడిశా రైలు ప్రమాదంలో 261 మంది మృతిచెందారు. 900 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని గోపాల్‌పుర్, ఖాంతాపుర, బాలాసోర్, భద్రక్, సోరో, కటక్ ఆస్పత్రుల్లో చేర్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

