గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై ఆప్ అధ్యక్షుడు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో కేంద్రం ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కూడా ముందస్తుకే కేంద్రం మొగ్గుచూపుతోందని కూడా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు.
ఓ కొత్త హిమాచల్‌ను ఆవిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలో ఉన్న సచ్ఛీలురందరూ ఆయా పార్టీలను వీడి, వెంటనే ఆప్‌లో చేరిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి ఆప్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఆయన హిమచల్ ప్రదేశ్ ప్రజలను కోరారు.
తాము ఇచ్చిన హామీలను బీజేపీ సీఎం జయరాం ఠాకూర్ కాపీ కొడుతున్నారని, తమనే ఆయన ఫాలో అవుతున్నారని కేజ్రీవాల్ విమర్శలు చేశారు. తాము ఢిల్లీలో 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అని ప్రకటించగానే.. సీఎం జయరాం ఠాకూర్ ఇక్కడ 125 యూనిట్ల వరకూ ఉచితమంటూ ప్రకటించారని అన్నారు. హిమాచల్‌లో కూడా 300 యూనిట్లు ఫ్రీ అని ప్రకటించామని, నఖల్ కొట్టడానికి కూడా అఖల్ ఉండాలని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.