CM Joseph Vijay | విద్యార్థులకు మీ విజయ్ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్
CM Joseph Vijay | తమిళనాడు(Thamila Nadu) నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ సి. జోసెఫ్ విజయ్(Joseph Vijay) ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
తమిళనాడు : తమిళనాడు(Thamila Nadu) నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ సి. జోసెఫ్ విజయ్(Joseph Vijay) ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ విద్యుత్ పై(Free electricity) తన తొలి సంతకం చేశారు. మహిళా భద్రత కోసం ప్రత్యేక దళం ఏర్పాటుపై రెండో సంతకం, డ్రగ్స్ నియంత్రణపై మరో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను జీవితంలో చాలా కష్టాలు అనుభవించాను. నన్ను చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. వాటిన్నటిని తట్టుకొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చాన్నారు.
రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలన్నారు. త్వరలోనే రాష్ట్ర పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని పేర్కొన్నారు. నా పాలన అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రజా ధానాన్ని వృథా చేయనని స్పష్టం చేశారు.టీవీకే పార్టీలో ఒకే ఒక పవర్ సెంటర్ ఉంటుంది. అది విజయ్ మాత్రమేనని పేర్కొన్నారు. పార్టీ నేతలు అహంకారాన్ని తలకెక్కించుకోవద్దని సూచించారు.
డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం మొదలు పెడుతామన్నారు. అలాగే మైనార్టీ ప్రజలకు అండాగా ఉంటానని సీఎం విజయ్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల వల్లే ఈ విజయం దక్కిందని, వారికి జీవితాంతం రుణపడ ఉంటానన్నారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ, కూటమి నేతలు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కాగా, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం(Sworn) చేశారు.
ఆదివారం 10 గంటలకు చైన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గవర్నర్ అర్లేకర్ వారితో ప్రమాణం చేయించాడు. విజయ్ ‘ఎన్నుమ్ నాన్’(విజయ్ అనే నేను)అంటూ తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో పాటు 9తొమ్మింది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు విజయ్ కుటుంబ సభ్యులు, వామపక్ష నాయకులు, సినీ ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

