న్యూఢిల్లీ: ఢిల్లీలో లాక్డౌన్ విధించడం లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇవాళ ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ ఎల్ఎన్జేపీ హాస్పిటల్‌ను సందర్శించారు. అక్కడ కోవిడ్ రోగులకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్ఎన్జీపీ హాస్పిటల్ దేశంలోనే ఉత్తమమైందని, ఇక్కడ 22 వేల కోవిడ్ రోగులకు చికిత్స అందించినట్లు ఆయన వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి 25 శాతం పాజిటివిటీ రేటుతో సుమారు 22 వేల కేసులు నమోదు అయినట్లు సీఎం కేజ్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లాక్డౌన్ పెట్టడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ఆఫీసుల్లోనూ నిబంధనలు కఠినతరం చేయాలని డీడీఎంఏ మీటింగ్‌లో కోరినట్లు ఆయన చెప్పారు.
కేసులు పెరుగుతున్న సందర్భంగా ఢిల్లీలోని ప్రైవేటు హాస్పిటళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ఖండించింది. ఢిల్లీలో సుమారు మూడు లక్షల ఆఫీసులు ఉన్నాయని, వీటిల్లో వేలాది మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారని, డీడీఎంఏ ఇచ్చిన తాజా ఆదేశాలతో చాలా మంది వ్యాపారులపై ప్రభావం పడనున్నట్లు వ్యాపారుల సమాఖ్య వెల్లడించింది. ఆ ఆదేశాలను పునసమీక్షించాలని కోరింది.