Omar Abdullah : పహల్గాంలో ఉగ్రదాడి, తాజాగా ఢిల్లీలో కారు పేలుడు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ రెండు ఘటనల్లోనూ కశ్మీరీల ప్రమేయం ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆ ప్రాంత యువతలో కొందరు ఉగ్రవాదం వైపు ఆకర్షితవడం దేశ సమగ్రత, శాంతికి ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు. డిల్లీ కారు పేలుడును ఖండించిన ఆయన కశ్మీరీలను ఉగ్రవాలుగా ముద్ర వేయొద్దని కోరారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటకు సమీపంలో నరమేధం సృష్టించిన కారు పేలుడును ఒమర్ అబ్దుల్లా ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన జమ్ము కశ్మీర్ ప్రజలు శాంతి, సోదరభావాన్ని పాటించాలని కోరారు. ‘ఢిల్లీలో జరిపిన కారు పేలుడు తీవ్రంగా ఖండించదగినది. అమాయకులను అత్యంత క్రూరంగా చంపడాన్ని ఏ మతం సమర్ధించదు. దోషులను పట్టుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది. అయితే.. మనమంతా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
జమ్ముకశ్మీర్‌లోని ప్రతి ఒక్కరూ ఉగ్రవాది కాదు. ఇక్కడి వారందరికీ ఉగ్రసంస్థలతో సంబంధాలు లేవు. అందుకే అందరినీ ఒకే గాటన కట్టి ఉగ్రవాదులనే ముద్ర వేయడం సరికాదు. ఎందుకంటే టెర్రిరిస్ట్ అనే ట్యాగ్ వేయడం ద్వారా ప్రజలను సరైన మార్గంలో నడిపించడం మరింత కష్టమవుతుంది’ అని సీఎం అబ్దుల్లా వెల్లడించారు. ఢిల్లీ కారు పేలుడు బాధ్యులను కఠినమైన శిక్ష వేయాలని డిమాండ్ చేసిన ఆయన.. విచారణ అంటూ అమాయకులను ఇబ్బంది పెట్టొందని కోరారు.
VIDEO | Jammu and Kashmir CM Omar Abdullah speaking on the recent blast near Delhi’s Red Fort, says, “Not every resident of Jammu and Kashmir is a terrorist. It is only a handful of people who have always tried to disturb the peace and brotherhood in Kashmir.”
(Full video… pic.twitter.com/PrntfxDUdP
— Press Trust of India (@PTI_News) November 13, 2025
‘వైద్యవృత్తిలో స్థిరపడిన వారు సైతం ఉగ్రవాదులుగా మారడం ఏంటి?’ అనే ప్రశ్నకు అబ్దుల్లా సూటిగా సమాధానమిచ్చారు. ‘బాగా చదువుకున్నవాళ్లు అలాంటి పనులు చేయరని మీకు ఎవరు చెప్పారు? చదువుకున్నవాళ్లు, మంచి ఉద్యోగం చేస్తున్నవాళ్లు కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అయితే.. ఈ వాస్తవం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డాక్టర్ ఉమర్ నబీని విధుల నుంచి తప్పించారు. ఆ తర్వాత అతడి గురించి నిఘా విభాగాలు ఏం దర్యాప్తు చేశాయి. అతడిపై విచారణ ఎందుకు జరపలేదు? అని అబ్దుల్లా మండిపడ్డారు. ఉమర్ లాంటి కొందరి వల్లే ఈ ప్రాంతంలో శాంతి కొరవడుతోంది.
#WATCH | Jammu | On Delhi terror blast case, J&K CM Omar Abdullah says, “It is highly condemnable. No religion can justify the killing of innocents with such brutality. Investigation will continue, but we must remember one thing – not every resident of Jammu and Kashmir is a… pic.twitter.com/WUq2GEXcaz
— ANI (@ANI) November 13, 2025
వారి కారణంగానే ప్రాంతంలో సోదరభావం దెబ్బతింటోంది. అందుకని ఈ ప్రాంతవాసులందరిపై ఉగ్రవాదులనే ముద్ర వేయకండి’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ కారు పేలుడులో ఇప్పటివరకూ 13 మంది మరణించారు. అయితే.. ఉమర్ బృందం ఢిల్లీతో పాలు పలు ప్రాంతాల్లో భారీ ఉగ్రకుట్రకు పాల్పడేందుకు వ్యూహ రచన చేశారు. కానీ, ఫరీదాబాద్‌లో ముగ్గురిని అరెస్ట్ చేయడంతో.. దొరికిపోతామనే భయంతో అతడు సూసైడ్ బాంబర్‌గా మారి.. అమాయలకును పొట్టనబెట్టుకున్నాడు.