న్యూఢిల్లీ: నైట్ క్లబ్ నుంచి తిరిగి వెళ్తున్న పది మంది లిఫ్ట్‌లో చిక్కుకున్నారు (stuck in lift). లిఫ్ట్ డోర్ తెరుచుకోకపోవడంతో సుమారు పది గంటల వరకు అందులో ఉండిపోయారు. గాలి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఆ క్లబ్‌కు చేరుకున్నారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఐదు మంది పురుషులు, ఐదుగురు మహిళలు శనివారం రాత్రి సౌత్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలోని కోడ్ క్లబ్లో లేట్ నైట్ పార్టీ జరుపుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత క్లబ్ నుంచి తిరిగి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే అది మొదటి అంతస్తు వద్ద ఆగిపోయింది. విషయం తెలుసుకున్న క్లబ్ సిబ్బంది లిఫ్ట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో లిఫ్ట్ నిర్వహణ సిబ్బందికి ఫోన్ చేశారు. రాత్రి వేళ కావడంతో వారు స్పందించలేదు.
కాగా, పలు గంటలపాటు లిఫ్ట్‌లో చిక్కుకున్న పది మంది ఆందోళన చెందారు. ఊపిరి అందక మహిళలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో క్లబ్ సిబ్బంది చివరకు ఆదివారం ఉదయం 6.40 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లిఫ్ట్ ఆగిన మొదటి అంతస్తు వద్దకు నిచ్చెన ద్వారా చేసుకున్నారు. అక్కడ ఉన్న పెద్ద అద్దాన్ని పగులగొట్టారు. అనంతరం లిఫ్ట్‌లో చిక్కుకున్న పది మందిని కాపాడారు. నిచ్చెన ద్వారా వారిని కిందకు చేర్చారు. షాక్‌లో ఉన్న వారంతా తమ ఇళ్లకు చేరుకున్నారు.
మరోవైపు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లేట్ నైట్‌లో కూడా క్లబ్ నిర్వహించేందుకు అనుమతి, ఆ మేరకు లైసెన్స్ ఉందా? లేదా? అన్నది తెలుసుకుంటామని పోలీస్ అధికారి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు చేపడతామని అన్నారు.
A fire call was received from South ex about 10 people stuck in lift, coming from club. Time 0542/43hrs.
Code Club, Khanna Jewellers, south extension metro station, new Delhi. Team returned
from rescue call and reports that 10 persons rescued safely from a lift by DFS. pic.twitter.com/mH4ico9JN4— Atul Garg (@AtulGargDFS) July 16, 2023