రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో క్లౌడ్‌బస్ట్(Cloudburst)తో కుంభవృష్టి కురిసింది. దీంతో భారీ స్థాయిలో అక్కడ వరద, బురద పొంగిపొర్లింది. దీని వల్ల వందల సంఖ్యలో కుటుంబాలు ఆ శిథిలాల్లో చిక్కుకున్నారు. అనేక మంది ట్రాప్ అయినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. బుస్కేదర్ తహసిల్‌లోని బరేత్ దుంగర్ టోక్‌తో పాటు చమోలీలోని దేవల్ ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది.
जनपद रुद्रप्रयाग के तहसील बसुकेदार क्षेत्र के अंतर्गत बड़ेथ डुंगर तोक और जनपद चमोली के देवाल क्षेत्र में बादल फटने के कारण मलबा आने से कुछ परिवारों के फंसे होने का दुःखद समाचार प्राप्त हुआ है। स्थानीय प्रशासन द्वारा राहत और बचाव कार्य युद्धस्तर पर जारी है, इस संबंध में निरंतर…
— Pushkar Singh Dhami (@pushkardhami) August 29, 2025
క్లౌడ్బస్ట్కు చెందిన విషయాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామీ కన్ఫర్మ్ చేశారు. జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టినట్లు తెలిపారు. అధికారులతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. బరేత్ దుంగర్ టోక్, దేవల్ ప్రాంతాల్లో శిథిలాల ప్రవాహంలో కొన్ని కుటుంబాలు చిక్కుకున్నట్లు సీఎం థామి తన ప్రకటనలో తెలిపారు.
💢लगातार हो रही भारी बारिश के कारण मंदाकिनी नदी का जल स्तर काफी बढ़ा हुआ है, थानाध्यक्ष अगस्त्यमुनि के नेतृत्व में पुलिस द्वारा अगस्त्यमुनि क्षेत्र में अनाउंसमेंट कर लोगों को सतर्क किया जा रहा है। pic.twitter.com/NyeAlJm7AY
— Rudraprayag Police Uttarakhand (@RudraprayagPol) August 29, 2025
కుంభవృష్టి తర్వాత ఇద్దరు అదృశ్యమైనట్లు జల్లా మెజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు. డజన్ల సంఖ్యలో జంతువులు శిథిలాల్లో చిక్కుకున్నట్లు చెప్పారు. భారీ వర్షాల వల్ల అనేక చోట్ల రోడ్లను మూసివేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు.
#WATCH | Rudraprayag District Administration informed that due to the cloudburst incident in Badeth Dungar Tok area of Tehsil Basukedaar of Rudraprayag district, information has been received about damage in some areas due to debris. Relief and rescue operations are being… pic.twitter.com/CJ8nkprjJS
— ANI (@ANI) August 29, 2025