షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల సమీపంలో సోమవారం ఉదయం నుంచి కుంభవృష్టి కురుస్తోంది. దీంతో ఆకస్మిక వరదలు వచ్చి కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని హోటళ్లు ధ్వంసమయ్యాయి. గత కొన్ని రోజులుగా హిమాచల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
రాత్రి మొత్తం కుంభవృష్టి కురవడంతో అక్కడి ప్రధాన నదుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. హిమాచల్లోనే కాదు ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యూపీ, ఎంపీ, రాజస్థాన్లలో పిడుగులు పడి 68 మంది మృతి చెందారు.
#WATCH Flash flood in Bhagsu Nag, Dharamshala due to heavy rainfall. #HimachalPradesh
— ANI (@ANI) July 12, 2021
(Video credit: SHO Mcleodganj Vipin Chaudhary) pic.twitter.com/SaFjg1MTl4
#WATCH | Manjhi River rages after heavy rainfall near Dharamshala. #HimachalPradesh pic.twitter.com/SvXhs1kKMS
— ANI (@ANI) July 12, 2021