ఫరీదాబాద్: కదులుతున్న కారులో15 ఏండ్ల బాలికపై దుండగులు రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో (Faridabad) రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న బాధిత బాలిక.. శనివారం ఉదయం తన సోదరుడిని స్కూల్ వద్ద వదిలి, తాను పాఠశాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో స్కూల్ వద్ద ఆగి ఉన్న కారులో కూర్చున్న వ్యక్తి.. ఆమె కారు వద్దకు రాగానే డోరు అద్దం ఓపెన్ చేసి తనను లోపలికి లాగేశాడు. కారు నడుతస్తూ ఉండగానే.. అందులో ఉన్న మరో వ్యక్తి మైనర్ బాలికపై రెండుసార్లు లైంగికదాడి చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
రోజంతా ఆమెను కారులో తిప్పారు. స్కూలు ముగిసే సమయానికి గ్రామ సమీపంలో ఆమెను కారులో నుంచి తోసేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. అయితే ఇంటికి చేరుకున్న బాలిక.. జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.