న్యూఢిల్లీ: పన్నెండో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త చెప్పింది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం జరిగే హిందీ పరీక్షకు హాజరుకాలేకపోతే వారికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం హోలీ పండుగను కచ్చితంగా జరుపుకోవా లనుకునే వారికి వెసులుబాటు కల్పిం చింది.
వారు ఈ పరీక్షను రాయకపోతే, మరో రోజున రాయవచ్చు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పాల్గొనేవారికి ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహిస్తారు. వారితోపాటు ఈ విద్యార్థులు కూడా హిందీ పరీక్షను రాయవచ్చు.