అహ్మదాబాద్: అహ్మాదాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని.. 8వ తరగతి విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు. ఆ మర్డర్‌కు చెందిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందిత విద్యార్థి తన స్నేహితుడితో మర్డర్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్(Instagram Chatting) చేశాడు. ఆ చాటింగ్ స్క్రీన్షాట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పోలీసుల విచారణలో హత్యకు చెందిన చాటింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
స్కూల్ పరిసర ప్రాంతంలో ఆ మర్డర్ జరిగింది. దీంతో భారీ స్థాయిలో విద్యార్థి పేరెంట్స్, స్థానికులు ఆందోళన చేపట్టారు. స్కూల్లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అయితే పోలీసుల విచారణలో చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ క్రైంకు పాల్పడిన విషయాన్ని నిందితుడు తన స్నేహితుడికి చెప్పాడు. చాటింగ్‌లో తానే చంపినట్లు చెప్పాడు. అయితే చాటింగ్ డిలీట్ చేసి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోవాలని మిత్రుడు సలహా ఇచ్చాడు.
జూనియర్ విద్యార్థి అటాక్ చేసిన ఘటనలో నయన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థుల మధ్య వాగ్వాదం చివరకు మర్డర్‌కు దారి తీసింది. సెవన్త్ డే అడ్వంటెస్ట్ స్కూల్లో ఈ హత్య జరిగింది. నయన్ బెదిరించాడని, అందుకే అటాక్ చేసినట్లు నిందితుడు చాటింగ్‌లో చెప్పాడు. కొడితే సరిపోయేది కదా, ఎందుకు చంపావా అని ఫ్రెండ్ చాట్ చేశాడు. అదంతా వదిలేయ్ అంటూ మర్డర్ చేసిన స్టూడెంట్ చాట్‌లో రిప్లై ఇచ్చాడు.