బెంగళూరు: కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప టెన్త్ పరీక్షల్లో 625/625 మార్కులు సాధించి అందరి అభినందనలు పొందుతున్నది. రైతు కుటుంబంలో జన్మించిన అంకిత మరింత బాగా చదువుకుని ఐఏఎస్ అధికారిగా దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నది. ఆమె తండ్రి బసప్ప రైతు కాగా, తల్లి గృహిణి. ఆమె ముథోల్ తాలూకాలో మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివింది.