ముంబయి: సామాజిక మాధ్యమంలో చేసిన అభ్యంతరకరమైన వీడియో పోస్ట్.. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో రెండు వర్గాల మధ్య మత చిచ్చును రేపింది. ఆదివారం రాత్రి సతారా జిల్లా పూసెసవాలీ గ్రామంలో రెండు వర్గాలకు చెందిన కొంతమంది పరస్పరం దాడికి తెగబడగా, ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జిల్లా అంతటా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. భద్రతా బలగాల్ని పెద్ద సంఖ్యలో మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సతారా జిల్లా అంతటా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.