న్యూఢిల్లీ, ఆగస్టు 23 : కేంద్రంలోని మోదీ సర్కార్ ఇచ్చిన మాటను నమ్మి..తాము ఉద్యమాన్ని విరమించామని, అయితే తమ మంచితనాన్ని బలహీనతగా భావించవద్దని సీజేపీ హెచ్చరించింది. వాగ్దానాలను నీరుగార్చటం, జాప్యం చేయటం తప్పుగా అర్థం చేసుకోవటం..మొదలైన చర్యలు దేశ యువతకు నమ్మకద్రోహంతో సమానమని పేర్కొన్నది. హామీలను నెరవేర్చటంలో ప్రభు త్వం ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని సీజేపీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కేంద్రం ఇచ్చిన వాగ్దానాలపై చర్చించేందుకు సీజేపీ జాతీయ కార్యవర్గం సోమవారం సమావేశం కానున్నది. శాంతియుతంగా ఉద్యమాన్ని మరోసారి ప్రారంభించే అవకాశమూ ఉందని సీజేపీ పేర్కొన్నది. తదుపరి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని, విద్యార్థులు, యువత, మద్దతుదారులు, స్వచ్ఛంద కార్యకర్తలను పార్టీ కోరింది.