CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
CJP Protest : అనవసరంగా ఎవరినీ నిర్బంధించకూడదని ఏకంగా సుప్రీంకోర్టే ఆదేశించినా ఢిల్లీలో అమలు కావడం లేదు. వరుసగా రెండో రోజు ఆదివారం కూడా ఢిల్లీ పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు.
CJP Protest : అనవసరంగా ఎవరినీ నిర్బంధించకూడదని ఏకంగా సుప్రీంకోర్టే ఆదేశించినా ఢిల్లీలో అమలు కావడం లేదు. వరుసగా రెండో రోజు ఆదివారం కూడా ఢిల్లీ పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ సహా పలు పక్షాలు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనల్ని అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులు వేలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని గృహ నిర్బంధం చేశారు.
రోడ్లపైకి ఎవరూ రాకుండా బారికెడ్లు ఏర్పాటు చేశారు. ఈ అంశంపై ఆదివారం సుప్రీంకోర్టు స్పందించింది. ఆందోళనకారుల్ని విడుదల చేయాలని ఆదేశించింది. వారివల్ల నిజంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తేనే అరెస్టు చేయాలని సూచించింది. శాంతియుతంగా నిరసన చేపట్టేవారిని ఇబ్బంది పెట్టకూడదని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెలువడి గంటలు కూడా గడవకముందే ఢిల్లీ పోలీసులు ఈ ఆర్డర్స్‌ను ధిక్కరించారు.
అనేక చోట్ల ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. కన్నాట్ ప్లేస్, రాజీవ్ చౌక్ నుంచి జంతర్ మంతర్ వద్దకు ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ (ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపై ఆందోళన చేస్తున్న అనేక మందిని పోలీసులు బలవంతంగా బస్సుల్లోకి ఎక్కిస్తున్నారు. రాజీవ్ చౌక్ నుంచి ర్యాలీగా బయల్దేరిన ఎస్ఎఫ్ఐ నేతల్ని కూడా పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. తమ జాతీయ అధ్యక్షుడు ఆదర్ష్ ఎం సాజి, ఇతర నేతలు సూరజ్ ఎలామోన్, అభిజీత్ మనిలాల్ వంటి వారిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్ఎఫ్ఐ ప్రకటించింది.
ఈ సందర్భంగా ఆదర్స్ ఎం సాజికి గాయాలైన వీడియోను కూడా ఎస్ఎఫ్ఐ సోషల్ మీడియ వేదికగా పంచుకుంది. అయితే, కోర్టు ఆదేశాలున్నప్పటికీ.. ఆదివారం కూడా పలువురు నేతల్ని ఇలా అరెస్టు చేస్తుండటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

