సీజేపీ ఆందోళన ఒక ఫ్లాప్ షో.. బీజేపీ నేత సంబిత్ పాత్రా
దేశ రాజధానిని దిగ్బంధించి బందీగా మార్చాలని చేపట్టిన నిరసన పూర్తిగా ఫ్లాప్ షోగా మిగిలిపోయిందని బీజేపీ నేత సంబిత్ పాత్రా శనివారం పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన వందలాదిమంది యువతను, పలువురు రాజకీయ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. అల్లరి మూకలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమిదని ఆయన అభివర్ణించారు.
బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబిత్ పాత్రా మాట్లాడుతూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ శక్తులతో చేతులు కలిపి, దేశంలో అరాచకాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. ఓట్ల చోరీపై ఇండియా కూటమి చేసిన ఆరోపణలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోసిపుచ్చలేదంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న సంఘటనలు, టీవీలు, సోషల్ మీడియా వేదికలలో కనిపిస్తున్న దృశ్యాలు వాస్తవ చిత్రాన్ని ప్రతిబింబించడం లేదని సంబిత్ పాత్రా అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- CJP
- Rahul Gandhi
- Sambit Patra
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

