న్యూఢిల్లీ: సీజేపీ నిరసన వీడియోలకు సంబంధించిన వివాదం నేపథ్యంలో తన వ్యాఖ్యలను తప్పుగా ఉటంకించారని సీజేఐ సూర్యకాంత్ శుక్రవారం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉంటుందని, ఏ అంశంపై విచారణ జరపడానికైనా ఎప్పుడూ నిరాకరించదని ఆయన స్పష్టం చేశారు.
యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా(యూఎన్సీఐటీఆర్ఏఎల్) సదస్సులో పాల్గొన్న సీజేఐ విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ చర్చకు దారితీసి విద్యార్థి ఉద్యమంలోని కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. మీడియాలో నా మాటలను తప్పుగా ఉటంకించారు అని ఆయన అన్నారు.