న్యూఢిల్లీ: వీలైన చోట వర్చువల్ పద్ధతిలో వాదనలు చేపట్టాలని జడ్జీలకు ఆదేశాలు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తెలిపారు. కోర్టులన్నీ వర్చువల్ విధానంలో నడిచేట్టుగా సూచనలు చేయాలని కొందరు సీనియర్ న్యాయవాదులు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాను కోరారు. అయితే ఆ అభ్యర్థనలను సుప్రీం చీఫ్ జస్టిస్ తిరస్కరించారు. కోర్టులన్నీ హైబ్రిడ్ మోడల్లోనే పనిచేస్తాయని, అయితే వాళ్లు కావాలనుకుంటే వర్చువల్ విచారణను ఎంపిక చేసుకోవచ్చు అని సీజే సంజీవ్ ఖన్నా తెలిపారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఆ అభ్యర్థన చేశారు.