CJI Sanjiv Khanna | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్స్ (EC) నియామకాలకు సంబంధించిన కమిటీ నుంచి సీజేఐని మినహాయించడాన్ని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారించే ధర్మాసనం సంజీవ్ ఖన్నా వైదొలిగారు. సెక్షన్-7 అమలుపై స్టే విధించాలంటూ ఓ ఎన్జీవో సహా ఇతర సంస్థలు పిటిషన్ను దాఖలు చేశాయి. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
ఈ కేసులో గతంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్పై విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు గోపాల్ శంకరనారాయణ్, ప్రశాంత్ భూషణ్ ఈ అంశాన్ని ప్రస్తావించగా.. దీనికి సీజేఐ స్పందిస్తూ ప్రస్తుతం వాదనలను వినలేమన్నారు. బెంచ్ నుంచి వైదొలిగారు. శీతాకాలం విరామం తర్వాత కేసును సుప్రీంకోర్టులోని మరొక బెంచ్ విచారిస్తుందని పేర్కొన్నారు. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సహా స్వచ్ఛంద సంస్థలు స్పందన చెప్పాలని ఆదేశించారు.