ప్యానెల్ సిఫారసులు అమలుచేయండి

- ఢిల్లీ, కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
- బడులు మూయాలన్న కమిషన్
- పరిశ్రమలు వారానికి 5 రోజులే
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఢిల్లీ, దేశ రాజధాని పరిధి (ఎన్సీఆర్)లో కాలుష్య నియంత్రణకు గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ మార్గదర్శకాలను తప్పక అమలు చేయాలని ఢిల్లీ, కేంద్రప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ వాయుకాలుష్యంపై శుక్రవారం విచారణను కొనసాగించింది. కాలుష్య నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సుప్రీంకోర్టుకు ప్యానెల్ అఫిడవిట్‌ను సమర్పించింది. పరిస్థితులు మెరుగుపడేంత వరకు ఢిల్లీలో బడులను మూసివేయాలని సూచించింది. ఎన్‌సీఆర్‌లోకి ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించింది. పరిశ్రమలు వారంలో ఐదు రోజులే అది కూడా రోజుకు 8 గంటలే పనిచేయాలని, వారాంతాల్లో మూసివేయాలని సిఫారసు చేసింది. డీజిల్ జనరేటర్లపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరింది. కాలుష్య నివారణకు ఐదుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని, నివారణ చర్యల అమలు పర్యవేక్షణకు 40 బృందాలను నియమించాలని సిఫారసు చేసింది. కాగా, ఢిల్లీలో బడులు తెరవడంపై కొన్ని చానళ్లు తమను విలన్‌గా చిత్రీకరించాయని కోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్య నివారణపై విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

