CJI Chandrachud : సుప్రీంకోర్టులో ఇవాళ ఒక న్యాయవాది తీరు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు ఆగ్రహం తెప్పించింది. ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఒక న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు న్యాయవాది వాదనలు వినిపించే క్రమంలో పదేపదే ‘యా.. యా..’ అనడంపై సీజేఐ విస్మయం వ్యక్తం చేశారు. ‘యా..’ అనే పదం గౌరవప్రదమైన పదం కాదంటూ సీరియస్ అయ్యారు.
‘మీరు కాఫీ షాప్‌లో లేరు.. కోర్టు రూంలో ఉన్నారు.. పదాలను జాగ్రత్తగా వాడండి.. ‘యా..’ అనే పదం అంటే నాకు, మా న్యాయమూర్తుల బెంచ్‌కు అలర్జీ. అలాంటి పదాలు వాడేందుకు మిమ్మల్ని మేం అనుమతించం’ అంటూ సీజేఐ డీవై చంద్రచూడ్ లాయర్‌కు చీవాట్లు పెట్టారు. సదరు లాయర్ 2018లో సుప్రీంకోర్టులో దాఖలైన ఓ రివ్యూ పిటిషన్‌పై వాదనలు వినిపించడం మొదలుపెట్టారు.
ఆ పిటిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32తో ముడిపడినది. భారత పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినప్పుడు, వారికి రాజ్యాంగ పరిహారపు హక్కును కల్పించడమే ఆర్టికల్ 32 ప్రత్యేకత. ఈ పిటిషన్లో ప్రతివాదిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ను పేరును కూడా పిటిషనర్ చేర్చారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి స్థాయి వ్యక్తి పేరును పిటిషన్లో ఎలా చేర్చారని ప్రశ్నించారు.
వెంటనే ఆ పేరును పిటిషన్ నుంచి తొలగించాలని కోర్టు రిజిస్ట్రీని సీజేఐ ఈ క్రమంలో మరోసారి లాయర్ స్పందిస్తూ.. గతంలో ఇదే పిటిషన్‌ను నాటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ డిస్మిస్ చేశారని, తదుపరి సీజేఐ ఠాకూర్ ధర్మాసనం ఎదుట రివ్యూ పిటిషన్ వేశామని, దాన్ని కూడా డిస్మిస్ చేశారని, ఇప్పుడు వేసిన పిటిషన్లో అందుకే గొగోయ్‌ని కూడా ప్రతివాదిగా చేర్చామని చెప్పారు. దాంతో సీజేఐ ఈ పిటిషన్‌తో రంజన్ గొగోయ్‌కు సంబంధం లేదని, ఆయన పేరును తొలగించాలని ఆదేశించారు.