న్యూఢిల్లీ: అసమానతలను అరికట్టేందుకు రాజ్యాంగం శక్తివంతమైన సాధనమని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. అసమానతల నిరోధించేందుకు అవసరమైన వ్యవస్థలు, సంస్థలను రాజ్యాంగం ఏర్పాటుచేసిందని అన్నారు.
బుధవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరించారు. దేశ పౌరులకు బాధ్యతలనూ రాజ్యాంగం నిర్దేశించిందని చెప్పారు.