న్యూఢిల్లీ: అరుణా షాన్‌బాగ్(Aruna Shanbaug) గుర్తున్నారా? ఆ నర్సు జీవితం యావత్ దేశాన్ని కలిచివేసింది. ముంబైలోని కేఈఎం ఆస్పత్రిలో ఆమె రేప్‌కు గురైంది. 1973లో జరిగిన ఆ ఘటనను .. ఇవాళ సుప్రీం సీజే డీవై చంద్రచూడ్ గుర్తు చేశారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసు విచారణ సమయంలో .. అరుణ జీవితాన్ని గుర్తు చేశారు. పనిప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నా కొద్దీ.. మహిళా డాక్టర్లను టార్గెట్ చేస్తున్నారని, గ్రౌండ్ స్థాయిలో మార్పులు తెచ్చేందుకు, మరో అత్యాచార ఘటన జరిగే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, అరుణా షాన్‌బాగ్‌కు జరిగిన అన్యాయం, వైద్య రంగంలోనే ఘోరమైన ఘటన అని సీజే తన తీర్పు సమయంలో పేర్కొన్నారు.
అరుణా షాన్‌బాగ్.. 25 ఏళ్ల వయసులో నర్సుగా చేశారు. కేఈఎం ఆస్పత్రిలో ఆమె 1967లో సర్జరీ డిపార్ట్మెంట్లో చేరారు. డాక్టర్ సుందీప్ సర్దేశాయి వద్ద ఆమె పనిచేశారు. 1974లో ఆమె ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ 1973, నవంబర్ 27వ తేదీన ఆమెపై వార్డు అటెండెంట్ పైశాచికంగా దాడి చేశాడు. లైంగికంగా దాడి చేసి, ఆమెను తాడుతో కట్టేశాడు. దీంతో ఆమె మెదడుకు తీవ్రమైన డ్యామేజ్ జరిగింది. 42 ఏళ్ల పాటు ఆమె ఎటూ కదలేని స్థితిలో(పర్సిస్టెంట్ విజిటేటివ్ స్టేట్) నిర్జీవంగా ఉండిపోయింది. 2015లో ఆమె తుది శ్వాస విడిచింది.
బ్రెయిన్ డ్యామేజ్ కావడం వల్ల అరుణకు పక్షవాతం వచ్చింది. ఏమీ మాట్లాడలేకపోయేది. కనీస అవసరాల కోసం ఆమె మరోవారిపై ఆధారపడేది. కేఈఎం ఆస్పత్రిలోనే ఉద్యోగులే ఆమెకు బలవంతంగా ఆహారం ఇచ్చేవారు. ఆమెను ఓ ఫ్యామిలీలా చూసుకున్నారు. అయితే యుథినేషియా ద్వారా మరణం పొందేందుకు ఆమె అభ్యర్థన పెట్టుకున్నది. కానీ ఆ అభ్యర్థలను కోర్టు తోసిపుచ్చింది. వాల్మీకి అనే వ్యక్తి కోపంతో అరుణపై అటాక్ చేసినట్లు పింకీ విరానీ తన పుస్తకంలో రాశారు.
2015, మే 18వ తేదీన అరుణ.. న్యూమోనియాతో చనిపోయారు. రేప్ నిందితుడు సోహన్‌లాల్ భర్తా వాల్మీకిపై కేవలం దొంగతనం, హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఏడేళ్ల జైలుశిక్ష తర్వాత అతన్ని రిలీజ్ చేశారు.