అతని లక్ష్యం సివిల్స్ సాధించడమే.. అందుకోసం పదేండ్ల పాటు నిర్విరామంగా కష్టపడ్డాడు. పుస్తకాలతో కుస్తీ పట్టాడు.. కానీ విజయం అతన్ని వరించలేదు.. కేవలం 11 మార్కులు తక్కువ రావడంతో తన లక్ష్యానికి దూరమయ్యాడు. ఈ సందర్భంగా ఓ సివిల్ అభ్యర్థి తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన చెందుతూ ట్వీట్ చేశాడు.
ఈ పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఆరు సార్లు సివిల్స్ పరీక్షలు రాశాను. మూడు సార్లు ప్రిలిమ్స్‌లో ఫెయిల్ అయ్యాను. రెండు సార్లు మెయిన్స్‌లో ఫెయిల్ అయ్యాను. చివరి ప్రయత్నంలో ఇంటర్వ్యూలో వచ్చిన తక్కువ స్కోర్‌తో విజయం సాధించలేకపోయాను. కేవలం 11 మార్కులు తక్కువగా రావడంతో.. సివిల్స్ కు దూరమయ్యాను అని రజత్ సాంబల్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.
రజత్ సాంబల్ స్వస్థలం జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లా. చండీఘర్‌లోని పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ కు ప్రిపేరవ్వడం ప్రారంభించాడు. చివరి ప్రయత్నంలో రజత్ 942 మార్కులు సాధించాడు. యూపీఎస్సీ భవనం ముందు దిగిన ఫోటోతో పాటు.. మార్కుల జాబితా ఫోటోను రజత్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశాడు.
10 years of hard work ended in ashes.
6 UPSC attempts over.
3 times prelims failed.
2 times mains failed.
In my last attempt, yesterday I succumbed due to low score in interview. Missed by 11 marks. #upscresult
“And still I rise”. pic.twitter.com/m8FRcJGCWu— Rajat sambyal (@rajatsambyal_) May 31, 2022