న్యూఢిల్లీ, జవనరి 10: ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మాఫియా డాన్ చోటా రాజన్ శుక్రవారం ఎయిమ్స్ దవాఖానలో చేరాడు. సైనస్ సమస్యతో బాధపడుతున్న రాజన్కు సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపినట్టు అధికారవర్గాలు చెప్పాయి. ఒకప్పుడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహింకు ప్రధాన అనుచరుడైన చోటారాజన్కు 2001లో జరిగిన హోటల్ యజమాని జయా షెట్టి హత్య కేసులో 2024లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
అయితే యావజ్జీవ కారాగార శిక్షను బాంబే హైకోర్టు నిలిపివేసిన తర్వాత ఇదే కేసులో రాజన్కు బెయిల్ లభించింది. అయితే ఇతర కేసులకు సంబంధించి జైలులో ఉండడంతో బెయిల్ లభించినా అతనికి ఊరట దక్కలేదు.