సోమవారం 30 మార్చి 2020
National - Feb 17, 2020 , 11:30:32

కళ్యాణదుర్గంలో చాపర్‌ అత్యవసర ల్యాండింగ్‌

కళ్యాణదుర్గంలో చాపర్‌ అత్యవసర ల్యాండింగ్‌

అమరావతి: ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రైవేటు చాపర్‌ అత్యవసరంగా ల్యాండింగ్‌ అయింది. ఇంధన సమస్యతో అత్యవసర ల్యాండింగ్‌ జరిగినట్లుగా సమాచారం. చాపర్‌లో జిందాల్‌ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. చాపర్‌ పొలాల్లో దిగడంతో దాన్ని చూసేందుకు చుట్టుప్రక్కల ప్రజలు పెద్దఎత్తున అక్కడి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. టెక్నికల్‌ టీం బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం బయల్దేరింది. మరో గంట వ్యవధిలో చాపర్‌ టేకాఫ్‌ తీసుకోనుంది.


logo