భారతదేశంలో ప్రతిభకు కొదువలేదు. వీరందరికీ సోషల్‌మీడియా మంచి ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తోంది. ప్రత్యేక నైపుణ్యాలుగల వ్యక్తుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఆన్లైన్లో చక్కర్లుకొడుతోంది. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులు భారత ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలోని కఠిన ప్రశ్నలకు గుక్కతిప్పుకోకుండా సమాధానమిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిని ప్రశంసిస్తున్నారు.
ఈ వీడియోను ‘బ్యోమకేశ్’ అనే యూజర్ ట్విటర్లో షేర్చేశాడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు విద్యార్థులను చాలా కష్టమైన ప్రశ్నలను అడిగాడు. వారిద్దరూ ఒక్క క్షణం కూడా ఆగిపోకుండా వాటికి సమాధానాలు ఇచ్చారు. అతడు మొదటి విద్యార్థిని పాండవ సోదరులు, ద్రోణాచార్య కుమారుడు, అర్జునుడి గురువు, మహాభారతానికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇంకో విద్యార్థిని రామాయణం గురించి ప్రశ్నలు అడిగాడు. వారిద్దరూ వాటికి తడబడకుండా సమాధానం చెప్పారు. ఈ వీడియోను ప్రశ్నలు అడిగిన వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. ‘ఇది స్కూల్ అంటే.. మీ పిల్లలను ఇక్కడే చేర్పించండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ ఆ పిల్లలను మెచ్చుకున్నారు. ఉత్తమ జ్ఞానాన్ని అందించినందుకు పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు.
ये कौन सा स्कूल है भाई यार , इधर ही एडमिशन कराओ बच्चों का 😇😇 pic.twitter.com/yFNpnVqBys
— Byomkesh (@byomkesbakshy) July 24, 2022