రాంచీ: లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్గా చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) తిరిగి ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి అయిన ఆయన ఐదేళ్ల పాటు ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్గా చిరాగ్ పాశ్వాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్ల పాటు ఆ పార్టీ అధ్యక్షుడిగా తాను కొనసాగుతానని మీడియాతో ఆయన అన్నారు.
కాగా, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి అయిన చిరాగ్ పాశ్వాన్ ఈ సందర్భంగా త్వరలో జరుగనున్న హర్యానా, జార్ఖండ్, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల గురించి పార్టీ నేతలతో చర్చించారు. జాతీయ కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీతో కలిసి లేదా సొంతంగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.