న్యూఢిల్లీ: హిందుత్వ ఇన్ఫ్లూయెన్సర్ స్వతంత్ర్య భరద్వాజ్‌పై లోక్ జనశక్తీ పార్టీ శుక్రవారం ఫిర్యాదు నమోదు చేసింది. తమ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ పేరును తప్పుడు పనులకు వాడుతున్నట్లు ఫిర్యాదులో ఆరోపించారు. జూలైలో జంతర్ మంతర్‌లో జరిగిన దాడి ఘటనలో.. ఓ సీజేపీ కార్యకర్త తండ్రిపై భరద్వాజ్ అటాక్ చేశాడు. ఆ ఘటనలో అతన్ని శుక్రవారం భరద్వాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాశ్వాన్ కానీ, తమ పార్టీకి కానీ భరద్వాజ్‌కు లింకు లేదని ఆ ఫిర్యాదులో తెలిపారు. సీజేపీ నిరసన సమయంలో గాయపడ్డ కార్యకర్తకు మద్దతుగా పార్టీ నిలబడిందని లోక్ జనశక్తీ పార్టీ పేర్కొన్నది. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు.
లోక్జనశక్తీకి చెందిన లీగల్ సెల్.. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసింది. ఓ ఇంటర్వ్యూలో భరద్వాజ్ మాట్లాడుతూ.. సీజేపీ నిరసన వేళ ఓ కార్యకర్త తండ్రి పగలగొట్టానని, అతనికి 60 కుట్లు పడ్డాయని, కానీ తనకు ఎటువంటి శిక్ష పడలేదని పేర్కొన్నాడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. పోక్సో, ఎస్సీ-ఎస్టీ చట్టం కింద భరద్వాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీహార్ సీఎం సమ్రాట్ చౌదరీ, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో భరద్వాజ్ దిగిన ఫోటోలు ఉన్నాయి. తన పేరుతో పాటు ఇతర నేతల పేర్లను భరద్వాజ్ దుర్వినియోగం చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని చిరాగ్ పాశ్వాన్ తన ఫిర్యాదులో కోరారు.