న్యూఢిల్లీ: సైనిక కార్యకలాపాలను రహస్యంగా కనిపెట్టేందుకు చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ(ఎన్‌యూడీటీ)కు చెందిన ఓ రోబోటిక్స్ ప్రయోగశాల దోమ పరిమాణంలో ఉన్న ఓ బుల్లి డ్రోన్‌ను తయారుచేసింది.
హ్యుమనాయిడ్ మిషన్ల నుంచి కంటికి కనిపించని పరిమాణంలో ఉండే సూక్ష్మ డ్రోన్ల వరకు ప్రయోగశాలలో తాము తయారుచేసిన రోబోలను ఎన్‌యూడీటీ పరిశోధకులు చైనా సెంట్రల్ టెలివిజన్‌కు చెందిన సైనిక చానల్లో గత వారాంతంలో ప్రదర్శించారు. దోమంత సైజులో ఉన్న ఓ సూక్ష్మ డ్రోన్‌ను తన చేతివేళ్లలో ఉంచుకుని టీవీ వీక్షకులకు చూపించిన ఓ ఎన్‌యూడీటీ విద్యార్థి ఈ తరహా మైక్రో డ్రోన్లు యుద్ధ రంగంలో శత్రువులకు సంబంధించిన సైనిక రహస్యాలను చిత్రీకరించి, తీసుకువస్తుందని చెప్పాడు.