శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 09:42:16

కావాల‌నే చైనా మ‌న విమానానికి అనుమ‌తివ్వ‌డం లేదు..

కావాల‌నే చైనా మ‌న విమానానికి అనుమ‌తివ్వ‌డం లేదు.. 

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్‌కు కేంద్ర‌బిందువైన వుహాన్ న‌గ‌రానికి వెళ్లవ‌ల‌సిన ఇండియా ఫ్ల‌యిట్‌కు చైనా నుంచి అనుమ‌తి రావ‌డం లేదు.  కావాల‌నే చైనా మన విమానానికి అనుమ‌తి ఇవ్వ‌డంలేద‌ని భార‌తీయ అధికారులు వెల్ల‌డించారు.  సీ-17 గ్లోబ్‌మాస్ట‌ర్‌ మిలిట‌రీ విమానాన్ని వుహాన్ న‌గ‌రానికి పంపాల‌ని భార‌త్ నిర్ణ‌యించింది. వైద్య ప‌రిక‌రాల‌తో  వెళ్లే ఆ విమానం.. అక్క‌డే ఉన్న కొంద‌రు భార‌తీయుల‌ను వెన‌క్కి తీసుకురావాల‌ని ప్లాన్ చేసింది. కానీ మ‌న సైనిక విమానానికి.. చైనా క్లియ‌రెన్స్ ఇవ్వ‌డంలేదు.  కోవిడ్‌19 వ్యాధి మ‌ర‌ణాల‌తో బిక్కుబిక్కుమంటున్న చైనాకు భార‌త్ స‌హ‌క‌రించేందుకు ముందుకు వ‌చ్చింది.  చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌కు కూడా సంఘీభావం తెలుపుతూ మోదీ లేఖ రాశారు. వీలైనంత స‌హాయం చేస్తామ‌ని వెల్ల‌డించారు. కానీ చైనా మ‌న ఫ్ల‌యిట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం లేద‌ని తెలిసింది. మిగితా దేశాల‌కు చెందిన స‌హాయ విమానాలు వెళ్లి వస్తున్నాయ‌ని, భార‌త్‌కు మాత్రం అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని అధికారులు చెబుతున్నారు. రిలీఫ్ ఫ్ల‌యిట్‌కు క్లియ‌రెన్స్ ఇవ్వ‌డంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు, భార‌త్ వైద్య ప‌రిక‌రాలను అందించ‌డం చైనాకు ఇష్టం లేదా అని అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.  మ‌రోవైపు కోవిడ్‌19 మృతుల సంఖ్య చైనాలో 2345కు చేరుకున్న‌ది. హుబేయ్ ప్రావిన్సులో నిన్న ఒక్క రోజే 109 మంది చ‌నిపోయారు.logo