షిల్లాంగ్, జూలై 23: మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టయింది. ఆరుగురు చిన్నారుల ను పోలీసులు రక్షించారు. ఇద్దరు మైనర్ అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. 73 మందిని అరెస్టు చేశారు.
పశ్చిమ గారోహిల్స్ జిల్లాలో ఉన్న బెర్నార్డ్ మరక్కు చెందిన రింపు బగన్ అనే ఫాంహౌజ్‌పై దాడులు నిర్వహించినట్టు ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు. 27 వాహనాలు, 400 మద్యం బాటిళ్లు, 500 కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు.