భోపాల్: ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ‘చైల్డ్ లైన్ 1098 కాల్’ను ఇకనుంచి రాష్ర్టాలకు అప్పగిస్తామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. రాష్ర్టాల్లోని పోలీస్ స్టేషన్లకు ఆ కాల్‌ను కనెక్ట్ చేస్తామన్నారు. ఆదివారం భోపాల్‌లో ఆమె మాట్లాడుతూ 1098 చైల్డ్‌లైన్ కాల్ తొలుత వివిధ ఎన్జీవో సంఘాలకు చేరుతున్నదని, దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం సమస్యగా మారిందన్న సంగతి తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కాల్ మొదట స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరినట్టయితే సమస్య పరిష్కారం త్వరితగతిన జరుగుతుందన్నారు.