Acharya Satyendra Das: సరయూ నదిలో సత్యేంద్ర దాస్ పార్దీవదేహం జల సమాధి
Acharya Satyendra Das: అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ పార్దీవదేహాన్ని జలసమాధి చేశారు. అంతిమయాత్రలో బాబ్రీ మసీదు అడ్వకేట్ ఇక్బాల్ అన్సారీ పాల్గొన్నారు.
అయోధ్య: అయోధ్యలోని సరయూ నదిలో ఇవాళ ఆచార్య సత్యేంద్ర దాస్(Acharya Satyendra Das) పార్దీవదేహాన్ని జలసమాధి చేశారు. రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతకుముందు గోపాల్ ఆశ్రమంలో ఆయన పార్దీవదేహాన్ని ఉంచారు. అంతిమయాత్రలో సాధువులు, రామభక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 85 ఏళ్ల దాస్ను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎస్జీపీజీ)లో చేర్చారు. తన 20వ ఏట సన్యాస దీక్ష తీసుకున్న సత్యేంద్ర దాస్ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామ జన్మభూమి ఆలయ పూజారిగా ఉన్నారు.
#WATCH | Acharya Satyendra Das, the chief priest of Ayodhya Ram temple, who passed away yesterday, given ‘Jal Samadhi’ in Saryu river in UP’s Ayodhya pic.twitter.com/zrYkaLZUrT
— ANI (@ANI) February 13, 2025
ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి పట్ల బాబ్రీ మసీదు మాజీ అడ్వకేట్ ఇక్బాల్ అన్సారీ స్పందించారు. అంతియాత్రలో ఆయన పాల్గొన్నారు. ఆచార్య పార్దీవదేహాన్ని తీసుకెళ్లిన వాహనాన్ని ఆయన లాగారు. దాస్ పట్ల ఉన్న ఐక్యతను, గౌరవాన్ని ఆయన చూపించారు. చాన్నాళ్లుగా కలిసి ఉన్నామని, ఎప్పుడూ ఐక్యత, సామరస్యం గురించి మాట్లాడుకున్నామని, కలిసి జీవించడంలో ఉన్న ఆందాన్ని సెలబ్రేట్ చేసుకున్నామని, కానీ ఇప్పుడు తన సహచరుడిని కోల్పోయినట్లు అడ్వకేట్ అన్సారీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

