న్యూఢిల్లీ, జూలై 9: ఛత్తీస్గఢ్ హైకోర్టు జడ్జి పీ శాం కోషీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ మేరకు సిఫార్సు చేసింది. తనను ఛత్తీస్గఢ్ నుంచి బదిలీ చేయాలని జస్టిస్ పీ శాం కోషీ ఈనెల ఐదున కొలీజియానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనను మధ్య ప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం ప్రతిపాదించింది. అయితే ఎంపీ తప్ప ఎక్కడికైనా బదిలీ చేయాలంటూ కోషీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయనను తెలంగాణకు బదిలీ చేశారు.