దమ్మపేట కోర్టులో మౌలిక వసతుల కల్పనకు విజ్ఞప్తి
జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దమ్మపేట బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్‌లోని రాష్ట్ర హైకోర్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోర్ట్‌ఫోలియో న్యాయమూర్తులు జస్టిస్ జె.శ్రీనివాసరావు, జస్టిస్ కె.శరత్‌లను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
దమ్మపేట, జూలై 17 : జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దమ్మపేట బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్‌లోని రాష్ట్ర హైకోర్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోర్ట్‌ఫోలియో న్యాయమూర్తులు జస్టిస్ జె.శ్రీనివాసరావు, జస్టిస్ కె.శరత్‌లను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దమ్మపేట కోర్టులో నెలకొన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దమ్మపేట కోర్టులో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, తీవ్రంగా ఉన్న కోర్టు ఉద్యోగుల కొరతను నివారించాలని వారు కోరారు.
అలాగే దమ్మపేటలో నూతనంగా సబ్ కోర్టు ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయాలని, అలాగే కోర్టు ఆవరణలో న్యాయదేవత విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు. బార్ అసోసియేషన్ సభ్యుల వినతులపై జస్టిస్ జె.శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారని ప్రతినిధులు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన వారిలో దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్, జనరల్ సెక్రటరీ లక్కినేని నరేంద్రబాబు, హైకోర్టు న్యాయవాది పెనుబల్లి రమేష్, ట్రెజరర్ తామ బాలరాజు, గేమ్స్ సెక్రటరీ తీర్నతి సంజయ్ ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

