On Field Controversy: ‘నువ్వా నేనా’ అన్నట్టు మైదానంలో సాగే పోరాటంలో విజయగర్జన చేసేది కొందరైతే.. పరాజయం బాధతో తలవాల్చేసే ముఖాలు మరొకొందరివి. ఏళ్లుగా ఆట స్థలం ఎన్నో భావోద్వేగాలకు చిరునామా అవుతోంది. గేమ్ పూర్తయ్యాక ప్రపంచమంతా తమవైపే చూస్తున్న వేళ.. గుండెలో రగిలే బాధను.. ఏళ్లుగా పరిష్కారమవ్వని సమస్యలను బ్యానర్లుగా ప్రదర్శిస్తున్నారు. విశ్వమంతా తమ అస్తిత్వ అజెండాను చాటుతున్నారు కొందరు. ఇదివరకు జాతివివక్షను నిరసిస్తూ.. ‘బ్లాక్‌లైవ్స్ మ్యాటర్స్’, స్వలింగ సంపర్కులకు మద్దుతుగా ‘ఎల్జీబీటీ’ పోస్టర్లు మైదానంలో వెలిశాయి. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లు వివాదాస్పద ఫ్లెక్సీని చూపడం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
హాకీ, క్రికెట్, టెన్నిస్, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్.. ఆట ఏదైనా ప్రపంచమంతా అభిమానులుంటారు. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీ అనుకోండి.. జనాలు కళ్లప్పగించి చూసేస్తారు. స్టేడియంలో ప్రేక్షకులు, టీవీల ముందు కోట్లాదిమంది నరాలు బిగబట్టి మ్యాచ్ చూస్తుంటారు. ఇదే అదనుగా ఆటగాళ్లు తమ ఇష్టాలను, కొందరు తమ ప్రాంత సమస్యలను యావత్ లోకానికి చెప్పాలనుకుంటున్నారు. మరికొందరు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు.
Argentina face the prospect of disciplinary action from Fifa after celebrating with a banner in support of their country’s claims to the Falkland Islands. pic.twitter.com/ZoWt278sr3
— BBC Sport (@BBCSport) July 16, 2026
ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు సెమీఫైనల్లో విజయం అనంతరం ‘ఫాల్క్‌లాండ్స్ అర్జెంటీనావే’ అనే అర్ధం వచ్చే పోస్టర్‌ను ప్రదర్శించారు. ఒకప్పుడు బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్న ఈ దీవి.. అర్జెంటీనాకు చెందుతుంది అని ప్రపంచమంతా చాటేలా ఫ్లెక్సీని మైదానంలో సగర్వంగా చూపించారు. అయితే.. ఈ ఘటనపై బ్రిటన్ వాణిజ్య కార్యదర్శి పీటర్ కౌల్(Peter Kyle) తీవ్రంగా ఖండించారు. అర్జెంటీనా ఆటగాళ్ల తీరు ఆమోదయోగ్యం కాదని, ఫిఫా వెంటనే దర్యాప్తు చేపట్టాలని పీటర్ డిమాండ్ చేశారు.
ఫిఫా వరల్డ్‌కప్ 2018లో సెర్బియాపై 1-2తో స్విట్జర్లాండ్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం.. ఇద్దరు స్విస్ ఆటగాళ్లు అల్బేనియాకు మద్దతుగా ‘డబుల్ ఈగిల్’ (Double Eagle) సెలబ్రేషన్ చేసుకున్నారు. సెర్బియా ఆ ప్రాంత స్వాతంత్య్రాన్ని గుర్తించడం లేదనే కోపాన్ని విశ్వ వేదికగా ప్రదర్శించారిద్దరు.

అలానే.. ఖతర్‌లో 2022 ఎడిషన్‌లో జపాన్‌తో మ్యాచ్‌కు ముందు జర్మనీ ఆటగాళ్లు నోటిపై చేతులు పెట్టుకొని ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అసలు కథేంటంటే.. మెగా టోర్నీలో రెయిన్బో రంగులో ఉండే ‘వన్ లవ్ ‘(OneLove) చేతి బ్యాండ్లను ఫిఫా నిషేధించింది. అయితే.. యూరప్ దేశస్థులు చాలామంది ఎల్జీబీటీ (LGBT)లకు మద్దతుగా వన్ లవ్ బ్యాండ్లు పెట్టుకోవాలనుకున్నారు.

ఒకవేళ మైదానంలో ఆటగాళ్లు ఎవరైనా చేతికి వల్ లవ్ బ్యాండ్‌తో కనిపిస్తే.. వారికి ఎల్లో కార్డు చూపాలనే కఠిన నియమం పెట్టారు నిర్వాహకులు. దాంతో.. జర్మనీ ప్లేయర్లు మా నోరు కట్టేస్తున్నారు, స్వేచ్ఛను హరిస్తున్నారు అనే సంకేతం వచ్చేలానోటికి చేతి అడ్డుపెట్టి ఫోటో దిగారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaza) జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్'(BLM) అనే ఉద్యమానికి బహిరంగంగానే మద్దతుగా తెలిపాడు ఖవాజా. ప్రపంచమంతా ఆ అంశంపై చర్చించాలనే ఉద్దేశంతో అతడు పాకిస్థాన్‌తో టెస్టు సమయంలో ‘అన్ని ప్రాణులు సమానమే’, ‘స్వేచ్ఛ అనేది మనిషి హక్కు’ అనే సందేశాలున్న షూ ధరించాడు.

మ్యాచ్ సమయంలో ఖవాజా అభంతరకర సందేశమున్న షూ ధరించడంతో ఆగ్రహించిన ఐసీసీ 2023 డిసెంబర్లో నిషేధం విధించింది. బ్యాటుపై సంకేతం ఉన్న స్టిక్కర్ అంటించేవాడు. టెస్టు ఓపెనర్‌గా ఆస్ట్రేలియా జట్టుకు విశేష సేవలందించిన ఖవాజా.. ఒక పాకిస్థానీ ముస్లిం. తన మతం, ప్రాంతం ఆధారంగా కొన్నిసార్లు వివక్ష ఎదుర్కొన్నానని అతడు వీడ్కోలు సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మైదానంలో రాజకీయ అంశాలను ప్రతిబింబించే ధోరణి 1938లోనే మొదలైంది. అప్పుడు బెనిటో ముస్సోలినీ (Benito Mussolini) పాలనలోని ఇటలీ.. తమ ఆటగాళ్లు ఫాసిస్టు ఫార్టీకి సంకేతంగా నల్ల జెర్సీ ధరించేలా చేసింది. అంతేకాదు గోల్ అనంతరం ఫాసిస్టు తరహాలో సెల్యూట్ చేయాలని సూచించింది. ఆతిథ్య ఫ్రాన్స్‌పై వ్యతిరేకతను చాటేందుకు.. తమ చారల జెర్సీ బదులు నిరసనకు ప్రతీకైన బ్లాక్ జెర్సీ ధరించారు ఇటలీ ఆటగాళ్లు.