Acharya Vidyasagar ji: జైన మత 108వ గురువు, నగ్న ముని ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ మృతికి చత్తీస్గఢ్ రాష్ట్రం ఇవాళ ఒకపూటను సంతాప దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యాసాగర్ జీ మరణవార్త తీవ్ర విచారకరమని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
కాగా, ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ జీ శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సజీవ సమాధి ద్వారా దేహాన్ని విడిచి వెళ్లారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం డొంగార్గఢ్లోని చంద్రగిరి తీర్థంలో ఆయన సజీవ సమాధి అయ్యి దేహాన్ని త్యజించారు. ఆయన మరణవార్త వెలుగులోకి రావడంతో ఇవాళ భారీ సంఖ్యలో జైన మత పౌరులు చంద్రగిరి తరలివెళ్తున్నారు.