న్యూఢిల్లీ, జూన్ 7: దేశంలో ఏడాది లోపే మనం మధ్యంతర లోక్సభ ఎన్నికలను చూడబోతున్నామంటూ కాంగ్రెస్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ శుక్రవారం జోస్యం చెప్పారు. ‘పార్టీ కార్యకర్తలారా మరోసారి ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.
ఆరు నుంచి ఏడాది లోపు దేశంలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి’ అంటూ బహిరంగ సమావేశంలో బఘేల్ పిలుపునిచ్చారు. పదేండ్ల పాలనలో పార్టీలను విచ్ఛిన్నం చేసిన, సీఎంలను బెదిరించిన, జైలుకు పంపిన, దర్యాప్తు సంస్థలతో వేధించిన వారికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారని బఘేల్ పేర్కొన్నారు.