రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 11 లోక్‌సభ సీట్లలో 10 స్థానాల్లో విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ తొమ్మిదింటిలో విజయం సాధించగా, కాంగ్రెస్ రెండింటిని కైవసం చేసుకుంది. ఈ సారి అదనంగా బస్తర్‌లో బీజేపీ విజయం సాధించింది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి భూపేశ్ బఘేల్ రాజ్‌నందన్‌గావ్‌లో బీజేపీ అభ్యర్థి కన్నా వెనుకబడి ఉన్నారు. కోబ్రా స్థానంలో పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ, అసెంబ్లీ విపక్ష నేత చంద్రదాస్ సతీమణి జ్యోత్స్న మహంత్ మాత్రమే కాంగ్రెస్ నుంచి ఆధిక్యంలో ఉన్నారు. కాగా, రాయ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి అగ్రవాల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 5.23 లక్షలు, దుర్గ్‌లో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ విజయ్ బఘేల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 4.38 లక్షలకు పైగా మెజారిటీ సాధించారు.
బీజేపీ 10
కాంగ్రెస్ 1