ఛత్తీస్‌గఢ్ కాకుల మృతి.. బర్డ్‌ఫ్లూగా అనుమానాలు!

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ బలోద్ జిల్లాలో నాలుగు కాకులు చనిపోయాయని అధికారులు తెలిపారు. వాటి మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు మూడింటి నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పక్షులు మృత్యువాతపడ్డాయి. వాటికి పరీక్షలు నిర్వహించగా.. బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ అధికారులు అప్రమత్తమయ్యారు. గత రెండు రోజుల్లో బలోద్ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండి గ్రామంలో నాలుగు కాకుల చనిపోయాయని కలెక్టర్ జాన్మేజయ్ మహోబే తెలిపారు. అవి ఫ్లూ కారణంగానే చనిపోయాయా?లేదా? తెలుసుకునేందుకు భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమన్ డిసీజెన్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కి నమూనాలు పంపినట్లు చెప్పారు.
బుధవారం గ్రామంలో ఓ కాకి చనిపోతే గుర్తించి స్థానికులు దహనం చేశారని మరో అధికారి తెలిపారు. ఆ తర్వాత మరో మూడు కాకులు చనిపోయాయని చెప్పారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లు తదితర పక్షుల రవాణాపై దృష్టి సారించారు. బర్డ్‌ఫ్లూపై ఫౌల్ట్రీ వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఏడు జిల్లాలోని ఫౌల్ట్రీల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా నెగెటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా.. దేశరాజధాని ఢిల్లీలోనూ కాకులు మృతువ్యాతపడ్డాయి. మయూర్ విహార్ ప్రాంతంలోని పార్క్‌లో సుమారు వంద కాకులు మరణించాయి. అధికారులు వాటి నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.
తాజావార్తలు
- ఉద్యోగుల సంఘాలతో చర్చలకు టైం ఫిక్స్
- RRR పోస్టర్ కూడా కాపీ కొట్టారా..స్పూర్తి పొందారా..?
- ఏదైనా జరిగితే మీదే బాధ్యత: సజ్జల
- మన ప్రజాస్వామ్యం ఎంతో శక్తివంతం: వెంకయ్య
- కశ్మీర్లో అల్లర్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర బహిర్గతం
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : ఎస్ఈసీ
- గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్
- బ్యాట్‌తో అలరించిన మంత్రి ఎర్రబెల్లి..!
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు