Chhatrapati Shivaji | ముంబై : ఛత్రపతి శివాజీ వినియోగించిన వ్యాఘ్ నఖ్ (పులిపంజా ఆకారంలో ఉండే ఆయుధం) భారత్‌కు వచ్చేసింది. లండన్ మ్యూజియం నుంచి బుధవారం తీసుకువచ్చినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. ఈ వ్యాఘ్ నఖ్‌ను ఈ నెల 19 నుంచి మ్యూజియంలో ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచనున్నట్టు ఆయన చెప్పారు.
1659లో సతార యుద్ధంలో వ్యాఘ్ నఖ్ అయుధంతోనే బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్‌ఖాన్‌ను శివాజీ మట్టుబెట్టారు. వ్యాఘ్ నఖ్‌ను మహారాష్ట్రకు తీసుకురావడానికి 14.08 లక్షలు మాత్రమే వ్యయం చేసినట్టు సుధీర్ చెప్పారు.