చెన్నై: అతనో నగల వ్యాపారి. తన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న ఉద్యోగాలకు పండుగ వేళ ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతున్నవారికోసం కార్లు, బైకులు కొన్నాడు. దీపావళి కానుకగా వారికి అందించాడు తమిళనాడుకు చెందిన జయంతి లాల్ (Jayanthi Lal).
జయంతి లాల్ (Jayanthi Lal) చెన్నైలో చలని జ్యువెల్లరీ షాప్ను నిర్వహిస్తున్నారు. తన వద్ద పనిచేస్తున్న వారికి రూ.1.2 కోట్లు విలువచేసే 10 కార్లు, 20 బైకులను దీపావళి కానుకగా అందించాడు. ‘వారంతా తన కుటుంబ సభ్యులుగా భావిస్తాను. తన కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న వారికి పండుగ సందర్భంగా ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. వారికోసం కార్లు, బైకులు కొన్నాను. ఇది వారి పనికి ప్రోత్సాహకంగా ఉంటుంది. ప్రతి యజమాని తన ఉద్యోగులను గౌరవించాలి.’ అని చెప్పారు.