లక్నో : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ఈనెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకల కోసం నాగపూర్ చెఫ్ విష్ణు మనోహర్ 7000 కిలోల రామ్ హల్వాను (Ram Halwa) తయారుచేసేందుకు సిద్ధమయ్యాడు. రామ్ లల్లాకు ఈ హల్వాను సమర్పించిన అనంతరం దాదాపు లక్షన్నర మందికి ప్రసాదంగా ఈ హల్వాను పంపిణీ చేయాలని విష్ణు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.
12,000 లీటర్ల సామర్ధ్యం కలిగిన స్పెషల్ కడాయిని వాడుతూ సుజీ కా హల్వాను తయారుచేస్తామని చెఫ్ వెల్లడించాడు. ఈ కడాయిని నాగపూర్ నుంచి అయోధ్యకు తరలిస్తారు. ఈ కడాయి బరువు 1300 నుంచి 1400 కిలోలు ఉంటుందని అంచనా. ఈ పాత్రను స్టీల్‌తో తయారుచేయగా మధ్యభాగం ఇనుముతో తయారైంది. దీంతో హల్వాను వండే క్రమంలో అది మండదు.
ఈ భారీ పాత్రలో 7000 కిలోల హల్వాను తయారుచేయవచ్చు. దీన్ని లిఫ్ట్ చేసేందుకు క్రేన్ అవసరమవుతుందని చెఫ్ విష్ణు మనోహర్ చెప్పుకొచ్చారు. ఇక రామ్ హల్వా తయారుచేసేందుకు వేయి కిలోల నెయ్యి, షుగర్, 900 కిలోల సుజి, 2000 లీటర్ల పాలు, 2000-2500 లీటర్ల నీరు, 300 కిలోల బాదం, కిస్మిస్లను సేకరిస్తున్నారు. భారీ హల్వాను వండి వార్చడం ద్వారా రామజన్మభూమి ట్రస్ట్ తరపున వరల్డ్ రికార్డ్ నమోదవుతుందని చెఫ్ విష్ణు మనోహర్ ఆశిస్తున్నారు. గతంలోనూ చెఫ్ మనోహర్ పలు వరల్డ్ రికార్డ్స్ సృష్టించారు.
Read More :
Udhayanidhi Stalin | తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..?