Udhayanidhi Stalin | తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..?
తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ నియమితులు కానున్నారా. సీఎం స్టాలిన్ తన కుమారుడిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టడానికి మార్గం సుగమం చేస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
చెన్నై: తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) నియమితులు కానున్నారా. సీఎం స్టాలిన్ (CM MK Stalin) తన కుమారుడిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టడానికి మార్గం సుగమం చేస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఫిబ్రవరిలో సీఎం స్టాలిన్ విదేశీ పర్యటకు వెళ్తున్నారని.. ఈ నేపథ్యంలో జనవరి చివరి వారంలో ఉదయనిధికి డిప్యూటీ (Deputy Chief Minister) సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నది.
ఉదయ నిధి ప్రస్తుతం స్టాలిన్ కేబినెట్లో క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే జనవరి 21న సేలంలో జరగనున్న పార్టీ యూత్ వింగ్ సమావేశం అనంతరం ఆయనను ఉపముఖ్యమంత్రిగా నియమిస్తూ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై డీఎంకే సంస్థాగత వ్యవహార కార్యదర్శి ఎలంగోవన్ స్పందించారు. ఆ వార్తలను కొట్టిపారేయలేమని.. కానీ తుదినిర్ణయం మాత్రం సీఎం స్టాలిన్దే అని స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో ఉదయనిధి చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. అందువల్ల ఆయనను డిప్యూటీ సీఎం చేయడంలో తప్పేమీ లేదన్నారు. అయితే డిప్యూటీ వార్తలను ఉదయనిధి కొట్టిపారేశారు. అవన్నీ వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. కాగా, 2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
సంవత్సర కాలంగా ఈ ప్రచారం జరుగుతున్నదని ప్రతిపక్ష అన్నా డీఎంకే నేతలు అంటున్నారు. ఆ వార్తలను కొట్టిపారేయలేమని, అదంతా నిజమేనని చెప్పారు. గత ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. తర్వాత ముఖ్యమంత్రిని చేస్తారు. 2026లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ అన్నారు. డీఎంకే కుటుంబ పార్టీ అనడానికి దీనికిమించిన పెద్ద ఉదాహరణ ఏమీ ఉండదని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

