న్యూఢిల్లీ: నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటైన ఒబాన్.. ‘కునో జాతీయ పార్క్’కు 20 కిలోమీటర్ల దూరంలోని బరోడా గ్రామంలోకి చొరబడింది. శనివారం రాత్రి చీతా దారి తప్పిందని మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లా అటవీ అధికారి పీకే వర్మ ఆదివారం మీడియాకు తెలిపారు. దాన్ని తిరిగి అటవీ ప్రాంతంలోకి మరలించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. చీతా మెడకు ఏర్పాటు చేసిన సాంకేతిక పరికరం నుంచి సిగ్నల్స్ వస్తున్నాయని, ఆ ప్రాంతంలోని గ్రామస్థుల్ని అప్రమత్తం చేసినట్టు చెప్పారు.