ChatGPT | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు పోటీగా తీసుకొచ్చిన ‘చాట్‌జీపీటీ సెర్చ్’ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ‘సైన్ ఇన్’ అవసరం లేకుండా..‘చాట్‌జీపీటీ సెర్చ్’ ఫీచర్‌ను అందరూ ఉపయోగించుకోవచ్చునని ‘ఓపెన్ఏఐ’ తాజాగా వెల్లడించింది. నిన్నటివరకు చాట్‌జీపీటీ సేవలు పొందేందుకు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ ఖాతా ద్వారా ‘సైన్ ఇన్’ కావాల్సిందే.
ఇప్పుడా అవసరం లేకుండా ‘చాట్‌జీపీటీ డాట్ కామ్’లోకి వెళ్లి, మనం కోరుకున్న అంశాన్ని సెర్చ్ చేయవచ్చునని ‘ఓపెన్ఏఐ’ వర్గాలు తెలిపాయి. దీనిపై కంపెనీ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సోషల్‌మీడియా ‘ఎక్స్’లో సరదాగా స్పందిస్తూ, ‘మేక్ సెర్చ్ గ్రేట్ అగేయిన్’ అన్న సందేశాన్ని పోస్ట్ చేశారు.